Tuesday, April 16, 2024
- Advertisement -

సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న దిల్ రాజు..

- Advertisement -

తమిళం లో ఘన విజయం సాధించిన సినిమా 96 ని తెలుగు లో దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్మించనున్నారు. దీని గురించి ఇప్పటికే మీడియా లో అనేక వార్తలు వచ్చినప్పటికీ ప్రాపర్ గా సినిమాకి సంబంధించి ఏం జరుగుతుంది అని ఎవరికి తెలియదు. అయితే శర్వానంద్, సమంత లు ఈ సినిమా లో విజయ్ సేతుపతి , త్రిష పాత్రల ను పోషిస్తున్నారు. ఈ సినిమా ను తమిళం లో 96 ని తీసిన ఒరిజినల్ డైరెక్టర్ ప్రేం కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా ప్రారంభం అయి ఇప్పటికే సగం కంటే ఎక్కువ పూర్తి అయిందని తెలుస్తుంది. హీరో శర్వానంద్ తన పాత్రకు సంబంధించి చాలా సన్నివేశాలను పూర్తి చేసుకొని హీరోయిన్ తో వచ్చే సన్నివేశాల కోసం సమంత షూటింగ్ జాయిన్ అయ్యే తరుణం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.

మరి కొద్ది రోజుల్లో సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలుకానున్నది. అన్ని అనుకునట్లు గా జరిగితే ఈ సినిమా యొక్క షూటింగ్ జూలై చివరికి పూర్తి అయ్యేలా ప్లాన్ చేశారు దిల్ రాజు.

ప్రస్తుతం శర్వానంద్ షూటింగ్ బ్రేక్ తీసుకున్నాడు. త్వరలో ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ లో చేరనున్నాడు. తమిళం లో ఒరిజినల్ గా సంగీతం సమకూర్చిన గోవింద్ వసంత్ ఈ సినిమా కి కూడా సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -