Wednesday, April 24, 2024
- Advertisement -

‘వాల్మీకి’ పిల్ల ఎవరో తెలుసా… ?

- Advertisement -

డింపుల్ హయాతి అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ అమ్మాయి పేరు తెలుగు ప్రేక్షకులు సరిగా విన్నది కూడా లేదు. అయితే ఆశ్చర్యం ఏంటి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పేరు ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది అంటే, వరుణ్ తేజ్ హీరో గా త్వరలో వస్తున్న సినిమా వాల్మీకి లో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆవిడని ఎంపిక చేశారు. తన అందచెందాలతో హాట్ హీరోయిన్ అనే ఇమేజ్ దక్కించుకున్న ఈ నటి కి ఇదే మొదటి సినిమా.

అయితే ఆసక్తికరం అంశం ఏంటి అంటే డింపుల్ హయాతి ఎవరో కాదు. మొన్న మొన్నటిదాకా శేఖర్ కమ్ముల చేసిన ఒక సినిమా లో హీరోయిన్. ఈ సినిమా నే కొంత భాగం షూటింగ్ చేసి, సంతృప్తి చెందక, సినిమా ఆపేసి, అదే కథ ని చైతన్య మరియు సాయి పల్లవి ల తో చేస్తున్నాడు శేఖర్.

శేఖర్ కమ్ముల సినిమా లో హీరోయిన్ పాత్ర అంటే ఎవరైనా కాదనకుండా ఒప్పుకుంటారు. అయితే అనూహ్యం గా వెంటనే అవకాశం కోల్పోయిన ఈ నటి ఇప్పుడు ఈ వాల్మీకి సినిమా మీద ఆశలన్నీ పెట్టుకుంది. ఎలాగైనా ఈ సినిమా తో మంచి పేరు తెచ్చుకోవాలనే దిశగా డింపుల్ హయాతి ఆలోచిస్తుంది. ఈ సినిమా లో ఏ మాత్రం మెప్పిస్తుంది అనేది చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -