సాయి ధరమ్ కోసం నిర్మాత గా మారుతున్న దర్శకుడు

249
Director Bobby Turn Producer for Sai Dharam Tej
Director Bobby Turn Producer for Sai Dharam Tej

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే చిత్రలహరి అనే సినిమా తో ఫామ్ లో కి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ త్వరలో నే ఒక ఆసక్తికరమైన సినిమా ని సెట్ చేయనున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే మారుతీ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు అనే వార్తలు వచ్చినప్పటికీ ఆ విషయం పైన పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు.

వివరాల్లో కి వెళితే సాయి ధరమ్ త్వరలో అరుణ్ పవార్ అనే దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈయన ఇంతకు ముందు సప్తగిరి తో రెండు సినిమాలు చేసాడు. త్వరలో సప్తగిరి హీరో గా రానున్న వజ్రకవచధర గోవిందా సినిమా కి అరుణ్ దర్శకుడు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు బాబీ నిర్మాత గా మారనున్నట్లు సమాచారం ఇప్పటి వరకు చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన అరుణ్ కి సాయి ధరమ్ అవకాశం ఇస్తాడా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.

సినిమా ని తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలని ముందే అనుకున్న దర్శకుడికి సపోర్ట్ గా బాబీ డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం.

Loading...