Tuesday, April 23, 2024
- Advertisement -

షాకింగ్…….. భార్యతో విడాకులకు అప్లై చేసిన క్రిష్?

- Advertisement -

టాలీవుడ్ వర్గాలను షాక్‌కి గురిచేస్తున్న వార్త ఇది. సినిమా లవర్స్‌ని కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. కేవలం రెండంటే రెండేళ్ళ క్రితమే పెళ్ళి చేసుకన్న సెన్సిబుల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ వివాహం ఇప్పుడు విడాకుల దాకా వచ్చింది. కారణాలు కూడా ఆశ్ఛర్యపరుస్తున్నాయి. గమ్యం, శాతకర్ణిలాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు క్రిష్. కంచె సినిమా అయితే నభూతో అనే స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫెషన్ పరంగా డాక్టర్ అయిన రమ్యను పెళ్ళి చేసుకున్నాడు.

అయితే ఈ ఇద్దరి కాపురం సవ్యంగా లేదన్న వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్యా మళ్లీ కలిసి ఉండలేనంత స్థాయిలో విభేదాలు రావడంతో ఇద్దరూ కూడా మ్యుచువల్ డైవోర్స్ కోసం అప్లై చేసుకున్నారట. త్వరలోనే ఈ వార్తను అధికారికంగా ఇద్దరూ ప్రకటించనున్నారు. ప్రొఫెషనల్‌గా క్రిష్ బిజీగా ఉండడం కూడా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు క్రియేట్ చేసిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వార్త తెలిసిన జనాలు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్……..హ్యూమన్ వ్యాల్యూస్ గురించి మనుషుల గురించి గొప్పగా చెప్పే డైరెక్టర్ క్రిష్ జీవితంలో ఈ విషాదాన్ని ఆయన అభిమానులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -