Friday, April 19, 2024
- Advertisement -

చిన్న సినిమా కి హ్యాండ్ ఇచ్చిన మారుతి

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం సీనియర్ దర్శకుల హవా నడవడం లేదు. ఇప్పుడు అంతా కొత్త దర్శకులు, కొత్త కథలు వస్తూ ఉండటం తో సీనియర్స్ అందరూ తమని తాము మళ్ళీ ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మన తెలుగు లో చాల మంది దర్శకులు అప్పుడప్పుడు నిర్మాతలు గా మారి చిన్న సినిమాలని ప్రేక్షకులకి అందిస్తారు. కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాల కి సమర్పకులు గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి కోవలో నే త్వరలో రానున్న చిత్రం ఫస్ట్ రాంక్ రాజు కి మొదట సమర్పకుడు గా వ్యవహరించారు మారుతి.

ఇప్పుడు శుక్రవారం సినిమా విడుదల అవుతున్న తరుణం లో మారుతీ ఈ సినిమా నుండి వైదొలగడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చిన్న సినిమాలకి ఎప్పుడూ అభయ హస్తం ఇచ్చే మారుతి ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురి అవుతుండగా, ఇండస్ట్రీ లో మాత్రం మారుతి కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు అనే టాక్ నడుస్తుంది.

ఇటీవల కలం లో మారుతీ సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రాలు లండన్ బాబులు, భలే మంచి చౌకబేరమ్, బ్రాండ్ బాబు లాంటి ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడిన పరిస్థితి కనిపించలేదు.అందుకే ఈ నెగటివిటీ ఈ సినిమా కి ఉండకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నారట మారుతీ. కానీ ఇది ఎంత వరకు నిజం అని అయన కానీ చిత్ర యూనిట్ కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -