Thursday, April 25, 2024
- Advertisement -

ఆ దర్శకుడిని నమ్ముకున్న రాజ్ తరుణ్

- Advertisement -

వరుస పరాజయాలతో డీలా పడిపోయిన రాజ్ తరుణ్ మళ్ళి సినిమాలు సైన్ చేస్తూ తిరిగి సక్సెస్ లో కి రావాలనే ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నాడు. ఆది నుంచి యూత్ఫుల్ సినిమాల తో ప్రేక్షకులని ఆకర్షించిన రాజ్ తరుణ్ లవర్ సినిమా తర్వాత కొంచెం గాప్ తీసుకున్నాడు. ఇప్పుడు తిరిగి మళ్ళి వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణం లో ఒక సినిమా సైన్ చేసిన రాజ్ తరుణ్ మరొక సినిమా మీద కూడా దృష్టి పెట్టాడు.

అయితే ఈ ఇంకో సినిమా కి కథ మారుతి అందిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు చాలా సినిమాలకి మారుతి కథ ని మాటలని అందించిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు అలా ఒక కథ రాజ్ తరుణ్ కి సరిపోతుంది అని ఒక కాంబినేషన్ ని సెట్ చేసే పని లో ఉన్నాడు మారుతి. కుదిరితే ఈ సినిమా కి నిర్మాత గా కూడా వ్యవహరించాలి అని మారుతి భావిస్తున్నాడు.

ఈ విషయానికి సంబందించిన పూర్తి వివారాలు త్వరలో తెలుస్తాయి. మారుతి కూడా తన స్వీయ దర్శకత్వం లో త్వరలో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా మొదలు పెట్టనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -