Thursday, April 25, 2024
- Advertisement -

డియర్ లత్కోర్, అప్పుడప్పుడు బ్రెయిన్ వాడు: ఇంద్రగంటి

- Advertisement -

దొరసాని సినిమా చూసిన చాలా మంది సినిమా వాళ్ళు సినిమా ని విపరీతం గా పొగిడారు. ఈ సినిమా బాగుందని, గొప్పగా తీసారని, ఎవరికీ తోచిన విధంగా వారు సినిమా ని పొగిడారు. అయితే ఆసక్తికరమైన విషం ఏంటి అంటే మోహన్ కృష్ణ ఇంద్రగంటి కూడా ఇందులో ఒకరు. సినిమా చూసిన ఆయన ట్విట్టర్ లో తనకి అనిపించింది చెప్పారు. అయితే అక్కడితో ఆగకుండా తెలుగు సినిమా ని తెలంగాణ సినిమా పునరావిష్కరిస్తుంది అనే అభిప్రాయం కూడా ఇచ్చారు. ఇలా తెలుగు సినిమా ని తెలంగాణ సినిమా అని విడగొట్టడం నచ్చని చాలా మంది ఆయనని విమర్శించారు.

అయితే ఇంద్రగంటి కొంత మంది కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ నే, తన కామెంట్స్ ని సమర్థించుకున్నారు.

“నేను అలా అనడం ఆంధ్ర సినిమా కి ఇన్సల్ట్ ఏమి కాదు. నేను అన్న మాటల మీద కట్టుబడి ఉన్నాను. ఇక నన్ను తిడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నడో, డియర్ లత్కోర్, బ్రెయిన్ వాడు. ఎక్సర్సిస్ అవుతుంది. కొంత మంది నీచంగా, వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ సినిమా అంటే, కొత్త ఐడియాస్ తో ఆ ప్రాంతం నుంచి, వారి కోణం నుంచి వస్తున్న కథల గురించి నేను చేసిన కామెంట్స్ అవి. ఏదైనా తెలుగు భాష లో నే సినిమాలు తీసేది.” అని చెప్పి తన కామెంట్స్ ని సమర్థించుకున్నారు దర్శకుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -