Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్’ రెండో టీజర్ ఎప్పుడంటే..?

- Advertisement -

రాజమౌళి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడట.. ప్రస్తుతం లాక్ డౌన్ తో ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులంతా ఇళ్లలోనే ఉన్నారు. దీంతో వీడియో కాలింగ్ ద్వారా రాజమౌళి అందరికీ దిశానిర్ధేశం చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ ప్రొడక్షన్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేస్తున్నట్టు తెలిసింది. ఇందు కోసం స్కైప్, ఇతర వీడియో కాలింగ్ యాప్ లను ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది.

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ బర్త్ డేకు మొదటి టీజర్ విడుదల చేసినట్టే రెండో టీజర్ ను కట్ చేసే పనిలో ఉన్నారట.. రాజమౌళి తన బృందంతో ప్రస్తుతం ఈ వీడియో కాలింగ్ టెక్నాలజీతో రెండో టీజర్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

మొదటి రాంచరణ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు రెండో టీజర్ కు రాంచరణ్ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20వ తేదీన రాజమౌళి ఇచ్చే 2వ టీజర్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారట.. ఈ క్రమంలో రాజమౌళి మొత్తం ఇప్పుడు ఇదే పనిని పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం దీన్ని వీడియోకాల్స్ ద్వారానే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

మే 3 తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశాలున్నాయి. అప్పుడు షూటింగ్ ప్రారంభవుతుంది. అందుకే ఇప్పుడు ఈ ఖాళీ టైంలో ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ బృందం తీవ్ర కసరత్తు చేస్తోందట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -