జక్కన్నకి ఆయన ఫ్యామిలీకి కరోనా…

552
Director SS Rajamouli and Family Tested Coronavirus Positive
Director SS Rajamouli and Family Tested Coronavirus Positive

దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని స్వయంగా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి కూడా కరోనా సోకిందని వెల్లడించారు.

దర్శకుడు రాజమౌళి ట్విటర్‌ ద్వారా తను తన కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డారని. తర్వాత జ్వరం తగ్గిపోయిందని… మేము కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం కొద్దిపాటి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. మాకు ఎటువంటి లక్షణాలు లేవు.. నిబంధనలు పాటిస్తున్నాం. శరీరంలో ప్రతిరోధకాలు ఏర్పడాలని చూస్తున్నాం.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం’ అని రాజమౌళి తెలిపారు.

Loading...