Thursday, April 18, 2024
- Advertisement -

రామ్ చరణ్ వాడే వాచ్ ధర ఎంతో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్ లో రామ్ చరణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇతర హీరోలతో పోలిస్తే చరణ్ సింప్లిసిటీనే ఎక్కువగా ఇష్టపడుతాడు. ఎక్కడ ఉన్న సరే ఒదిగి ఉండే సూత్రం పాటిస్తూ ఉంటాడు. అతని తండ్రి నుంచి ఇది వచ్చిందని అర్దం అవుతుంది. ఇక డ్రెస్సింగ్ సెన్స్.. వాడే వాచ్ ల్లో కూడా పెద్ద హంగామా ఉండదు.

చాలా సింపుల్ గా ఉంటాడు. ఇటీవలే నిహారిక ఎంగెజ్మేంట్ జరిగింది. ఈ వేడుకలో కూడా చరణ్ చాలా సింపుల్ గా కనిపించారు. సతీమణి ఉపాసనాతో కలిసి చరణ్ పోటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోలను గమనిస్తే చరణ్ ధరించిన జి షాక్ కాసియో GM-5600B-3DR గ్రీన్ రెసిన్ మెన్స్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. యూత్ కి బాగా నచ్చే బ్రాండ్ ఇది. దీంతో సోషల్ మీడియాల్లో ఆ వాచ్ ఫోటోని వైరల్ గా షేర్ చేస్తున్నారు. ఇక ఈ వాచ్ ధర ఎంత ? అన్నది ఆరా తీస్తే.. సుమారు రూ.14000 ఉంటుందని తెలుస్తోంది.

ఇంతకంటే ఖరీదైన బ్రాండెడ్ వాచ్ లు ఎన్ని ఉన్నా జి-షాక్ మోడల్ యూత్ ఫుల్ కాబట్టి ఫోకస్ కూడా ఎక్కువే. ఇటీవలే రానా పెళ్లికి కూడా చరణ్ ఈ వాచ్ పెట్టుకునే వెళ్ళాడు. ఇక చరణ్ కు ఖరీదైన స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. నిహారిక ఎంగెజ్మెంట్ వేడుకలో చిరంజీవి కూడా సింపుల్ గా కనిపించగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఎంతో స్టైలీష్ గా కనిపించారు. ఇక చరణ్ ప్రస్తుతం RRR సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

టాలీవుడ్ స్టార్ హీరోల మొదటి మూవీ ఏదో చూడండి ?

అతనితో విడిపోయాక చాలా రూమర్స్ వచ్చాయి : యాంకర్ ఝాన్సీ

‘ఛీ దరిద్రుడా.. తూ’ అని సుధీర్ పరువు తీసిన రష్మీ..!

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -