వినాయక్ పక్కన హీరోయిన్ ఎవరో తెలుసా?

749
Do you know Who is the Heroine next to Vinayak?
Do you know Who is the Heroine next to Vinayak?

వీ వీ వినాయక్ తెలుగు సినిమా పరిశ్రమ లో ఒక స్టార్ డైరెక్టర్ గా అందరికీ పరిచయమే. వినాయక్ అంటే ఎంత గౌరవం ఉంది అంటే, చిరంజీవి తన 150 వ సినిమా కి వినాయక్ ని దర్శకుడి గా పెట్టుకొని సినిమా పరిశ్రమ లో కి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం వినాయక్ కి హిట్ రాలేదు. అఖిల్, ఇంటెలిజెంట్ సినిమాలు పెద్దగా ఆడకపోవడం తో వినాయక్ కెరీర్ అయిపొయింది అని అంతా హేళన చేశారు. అయితే వినాయక్ మాత్రం ఈ సారి నటుడిగా తన ప్రతిభ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

దర్శకుడిగా తానేంటో అందరికీ చూపించిన వినాయక్, ఈ సారి నటుడిగా తన ప్రతిభ ని చూపించుకోవాలనే ఆసక్తి తో ఒక సినిమా ని ఒప్పుకున్నారు. అక్టోబర్ 9 న వినాయక్ పుట్టిన రోజున ఈ సినిమా కి శ్రీకారం చుట్టనున్నారు చిత్ర యూనిట్. శరభ అనే సినిమా ని ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన నరసింహ రావు ఈ సినిమా కి దర్శకులు. వినాయక్ హీరో గా వస్తున్న ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాత.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా లో వినాయక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట.అంతే కాకుండా ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రీయ ని అప్రోచ్ కాగా ఆమె తన నిర్ణయం ఇంకా ప్రకటించలేదట. ఒకప్పుడు శ్రీయ ని డైరెక్ట్ చేసిన వినాయక్ ఇప్పుడు శ్రీయ తో జతకట్టనుండటం కాస్త విచిత్రం గా నూ ఆసక్తికరం గా నూ ఉంటుంది అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఈ విషయమై ఒక అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Loading...