Thursday, April 25, 2024
- Advertisement -

దొరసాని రివ్యూ

- Advertisement -

శివాని రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ కలిసి దొరసాని అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఈ ఇద్దరికీ మొదటి సినిమా. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమా మీద ఉన్న అంచనాలని అమాంతం పెంచేసిన చిత్ర యూనిట్ సినిమా తో మంచి కలెక్షన్స్ రాబట్టాలి అని చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తో కెవీఆర్ మహేంద్ర అనే కొత్త దర్శకుడు తెర కి పరిచయం కానున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ని మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మించగా, సురేష్ బాబు సినిమా ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సమీక్ష విషయానికి వస్తే…

కథ:

తెలంగాణ లో ఘడీ ల కాలం నడుస్తున్న నేపథ్యం లో ఒక జమీందారు కుటుంబం లో పుట్టిన దొరసాని (శివాని) కి వాళ్ళ ఊర్లో ఉండే ఒక మాములు కుటుంబం, కులానికి చెందిన రాజు (ఆనంద్) కి ప్రేమ చిగురిస్తుంది. కానీ ఈ ప్రేమ విషయం దొరసాని ఇంట్లో తెలిసిపోతుంది. అప్పుడు దొరసాని తండ్రి, దొరగారు ఏం చేశారు? రాజు దొరసాని తమ ప్రేమ ని నెగ్గించుకున్నారా? చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ

నటీనటులు:

యాక్టింగ్ కి కొత్త అయినప్పటికీ ఆనంద్ దేవరకొండ మరియు శివాత్మిక ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. మొదటి సినిమా అయినప్పటికీ ఇద్దరూ తమ నటనలో మెచ్యూరిటీ ని చాలా బాగా చూపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. డైలాగ్ డెలివరీ కానీ ఫేస్ ఎక్స్ ప్రెషన్లు కానీ ఎటువంటి లోపాలు లేకుండా ఇద్దరూ చాలా బాగా నటించారు. కన్నడ కిషోర్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. వినయ్ వర్మ నటన కూడా సినిమాకి ప్లస్ అయింది అని చెప్పవచ్చు. శరణ్య తన పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. బైరెడ్డి వంశీ నటన సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. కృష్ణారెడ్డి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కించుకోవడమే కాక తన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర ఈ సినిమా కోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నారు. ఆ కాలంలో ఉండే పద్ధతులు పరిస్థితులు చాలా బాగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను కె.వి.ఆర్ మహేంద్రా చాలా బాగా నెరేట్ చేశారు. మధుర శ్రీధర్ రెడ్డి మరియు యష్ రంగినేని అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇద్దరూ కొత్త నటీనటులు అయినప్పటికీ నిర్మాతలు బడ్జెట్ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా ఇన్వెస్ట్ చేశారని చెప్పొచ్చు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. కేవలం పాటలు మాత్రమే కాక ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. సినిమాలోని ఎమోషన్ల ను ఎలివేట్ చేసే విధంగా చాలా బాగుంది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. 80ల కాలంలో ని వాతావరణాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

తీర్పు:

పీరియడ్ డ్రామాలు చేయడం అంత సులువైన విషయం కాదని తెలిసిందే. కానీ దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి భాగం మొత్తం రొమాన్స్ తో నింపారు. ఆనంద్ దేవరకొండ మరియు శివాత్మిక ల పాత్రలు చాలా అందంగా డిజైన్ చేయడమే కాక వారిద్దరి మధ్య ప్రేమ కథను కూడా చాలా బాగా తెరకెక్కించారు. మొదట కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది అక్కర్లేని కామెడీ సన్నివేశాలు పెట్టి దర్శకుడు కథ ని డిస్టర్బ్ చేయకుండా చూసుకున్నారు. నటీనటులు మరియు బలమైన కథ ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు గా చెప్పుకోవచ్చు. చివరిగా ‘దొరసాని’ సినిమా ఒక మంచి కథ ఉన్న సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -