Thursday, April 25, 2024
- Advertisement -

ఫేస్ బుక్ టీం వల్ల ‘దొరసాని’ కి ఏమీ ఒరగలేదే

- Advertisement -

ఈ మధ్యనే విడుదలైన దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు సీనియర్ హీరో రాజశేఖర్ రెండవ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సినిమా విడుదలకు ముందు ఎన్ని ప్రమోషన్లు చేసినప్పటికీ అవి సినిమా పై అంత ప్రభావం చూపించలేకపోయాయి. పెర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరూ మంచి మార్కులు వేయించుకున్నప్పటికీ లుక్స్ పరంగా మాత్రం అంతగా మెప్పించలేకపోయారు. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ కి పల్లెటూరి లుక్ ఏమాత్రం సెట్ అవ్వలేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.

కథ, క్లైమాక్స్ పక్కనపెడితే మ్యూజిక్ కూడా బాగానే ఉంది కాని సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయంపై ఆరా తీస్తే దర్శకనిర్మాతలు చేసిన మొదటి తప్పు ఫేస్ బుక్ క్రిటిక్స్ ని నమ్మడం. రామానాయుడు స్టూడియోస్ లో విడుదలకు ముందే ఫేస్ బుక్ క్రిటిక్స్ కి చిత్ర బృందం సినిమా స్క్రీనింగ్ వేసింది. చూసిన వాళ్ళు సినిమా అదిరిపోయింది అని ఏదో నామమాత్రంగా చెప్పేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆ సో కాల్డ్ ఫేస్బుక్ వాళ్ళు కూడా ఆ సినిమా చూడలేదు. అలా వాళ్ళు ఎంత పొగిడినా కలెక్షన్ల పరంగా మాత్రం ‘దొరసాని’ సినిమా ఫ్లాప్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -