Tuesday, March 19, 2024
- Advertisement -

రష్మీకకు ముద్దుపెట్టిన అభిమాని..!

- Advertisement -

కన్నడ హీరోయిన్ రష్మీకకు ఓ అభిమాని ఊహించని షాక్ ఇచ్చాడు. సెల్ఫీ దిగడానికి వచ్చి ముద్దు పెట్టి పరిగెత్తాడు. అకస్మాత్తుగా ఈ ఘటన జరగడంతో రష్మీక సహా అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

’చలో’ మూవీతో తెరంగేట్రం చేసిన రష్మిక.. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన ‘భీష్మ’ సినిమా ఈ నెల 21న రిలీజ్‌ కాబోతోంది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రష్మికను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేని రష్మిక వారితో సెల్ఫీలు దిగింది.

ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగి ఆ వెంటనే ముద్దు పెట్టి అక్కడ నుంచి పరిగెత్తాడు. ఆమెకు ముద్దుపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో స్పందించిన రష్మిక కార్యక్రమ నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలిగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -