Friday, April 26, 2024
- Advertisement -

సమంత కి అంత సీనుందా?

- Advertisement -

తెలుగు సినిమాల్లో టాప్ స్థానం లో కొనసాగుతున్న హీరోయిన్లు, స్టార్ డం అనుభవిస్తున్న హీరోయిన్లు ఉన్నారు కానీ ఒక తెలుగు సినిమా హీరో కి సమానం గా మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోయిన్లు మాత్రం లేరు. ఒక్క అనుష్క శెట్టి తప్ప, తెలుగు లో ఇంకెవరికీ సినిమా ని తమ భుజాల మీద వేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలు సంపాదించిన రికార్డ్ లేదు. కాకపోతే ఇప్పుడు సమంత ని ఇండస్ట్రీ ట్రీట్ చేస్తున్న విధానం చూస్తే మాత్రం నిజంగా సమంత కి అంత సీనుందా అనిపించక తప్పదు.

ఒక నటి గా సమంత పెద్ద స్టార్ కావచ్చు కానీ తన కెరీర్ లో తను చేసిన ప్రయోగాలు మాత్రం చాలా తక్కువ. పైగా దాదాపు ఆమె వేసిన హీరోయిన్ పాత్రలు అన్నీ గ్లామరస్ పాత్రలే. ఈ నేపథ్యం లో సమంత కి తన తదుపరి చిత్రం ఓ బేబీ విడుదల సందర్భం గా దేవి సినిమా థియేటర్ దగ్గర ఏకం గా పెద్ద కటౌట్ ఏ పెట్టేసారు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా కి ఇచ్చిన బిల్డప్, హైప్ ఈ సినిమా కి ఇస్తున్నారు.

సినిమా రిసల్ట్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ సమంత రేంజ్ కి మించి ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి అని మాత్రం ఒప్పుకొని తీరాలి.

https://www.instagram.com/p/Bzcht0YJEX4/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -