Friday, March 29, 2024
- Advertisement -

రేప్ ని కమర్షియల్ ఎలిమెంట్ గా మార్చేసిన దర్శకుడు

- Advertisement -

వరుస ఫెయిల్యూర్ లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ తాజాగా రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశం మాత్రం అభిమానులను సైతం పూరి పై మండి పడేలా చేస్తోంది. ఇందులో రామ్ నభ ని చూసి అర్ధరాత్రి ఆమె ఎక్కిన ఆటో ఎక్కి ఆమెను అల్లరి చేస్తాడు. ఆమెని రోడ్డుమీద పరిగెత్తించి ఇంటివరకు ఫాలో అయిపోతాడు. చివరికి బెడ్రూమ్ దాకా వచ్చేసి ఆమె పైకి ఎక్కి నేను రేప్ చేస్తాను అని బెదిరిస్తాడు. ఈ లోపు ఈమె పోలీసులు కి ఫోన్ చేసి తనని రేప్ చేస్తున్నారు వచ్చి రక్షించమని కంప్లైంట్ చేస్తుంది.

పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చే లోపల రామ్, నభ ల మధ్య కెమిస్ట్రీ కుదిరిపోయి రామ్ పైకి ఎక్కేస్తోంది నభ. తలుపులు బద్దలు కొట్టుకొని లోపలకు వచ్చిన పోలీసులకు మాత్రం మా మధ్య డీల్ కుదిరింది మీరు వెళ్లిపోవచ్చు అంటూ చెబుతుంది. పూరి జగన్నాథ్ ఈ సన్నివేశాన్ని కామెడీ కోసమో లేక వారి మధ్య ప్రేమ పుట్టడం గురించి చూపించడానికి అన్నట్టు పెట్టి ఉండొచ్చు కానీ దానిని చూపించే పద్ధతి మాత్రం ఇది కాదని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. రేప్ వంటి సున్నితమైన అంశాన్ని కమర్షియల్ గా వాడటమేమిటి? రేప్ చేస్తానని బెదిరించడం హీరోయిజం ఎలా అవుతుంది? పోలీసులకి ఫోన్ చేసి రమ్మని తీరా వాళ్లు వచ్చాక డీల్ కుదిరింది వెళ్లిపోమంటే పోలీసులు ఏమన్నా పిచ్చివారిలా కనిపిస్తున్నారా? ఇలాంటి సున్నితమైన సమస్యల మీద పూరి జగన్నాథ్ కామెడీ పుట్టించటం చాలా అసహ్యంగా ఉంది అంటూ కొందరు పూరి పై మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -