సోషల్ మీడియా లో మీ రచ్చ ఏందిరా నాయనా..?

319
fans extream on heroos
fans extream on heroos

ఫాన్స్ వార్ అనేది ఒకప్పుడు భౌతికంగా ఉండేది కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా లోనే.. తమ హీరో గొప్ప అంటూ తమ హీరో గొప్ప అంటూ అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఇక ఏదైనా స్పెషల్ డే వస్తే వేరే హీరో కన్నా మించి ట్వీట్ లు చేయాలనీ తెగ కష్టపడుతుంటారు.. ఇటీవలే కాలంగా ఈ వార్ మరింత పెరిగిపోయిందని చెప్పొచ్చు.. విజయ్ దేవరకొండ అభిమానులనుంచి ప్రభాస్ అభిమానుల దాకా ఈ సోషల్ మీడియా లో తామంటే తాము అని అభిమానులు పిచ్చి పట్టినట్లు ట్వీట్ చేయడం ఎక్కడి కి దారి తీస్తుందో అర్థం కావట్లేదు..

వాస్తవానికి ఇది తమ హీరో పై ప్రేమను చూపడానికి అయితే బాగుంటుంది కానీ వీరు ఇగోలకు వెళ్లి వేరే హీరో ని డీగ్రేడ్ చేసే వరకు వెళ్తుంది. తమ హీరో కాకుండా వేరే హీరో కి సంభందించిన అప్ డేట్ ఏదైనా వస్తే చాలు దాన్ని ఎలా అణగదొక్కాల అని ప్రయత్నిస్తున్నారు.. ఇక ఈ మధ్య తమ హీరోల పుట్టిన రోజులకు ట్రెండ్స్ చేయడాన్ని అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇందులోనూ రికార్డుల కోసం కొట్టేసుకుంటున్నారు. ఈ రికార్డుల్లో కూడా ఏవి నిజమో.. ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల ఫాన్స్ అయితే తమ హీరో పుట్టిన రోజున ట్వీట్ లు ఇన్ని పడ్డాయి అని చెప్పుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే ఇది అభిమానించే వరకైతే పర్వాలేదు కానీ ఇతర హీరో ని డీగ్రేడ్ చేస్తేనే వారికి ఇబ్బంది.. ఎందుకంటే హీరో లు అందరు బాగానే ఉంటారు కానీ ఎటొచ్చి ఫ్యాన్స్ ఇరుకున పడిపోతారు.. కొట్లాటకు వెళ్లి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దారుణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. అభిమానం ఆనందం తెప్పించేలా ఉండాలి కానీ ఇలా ప్రాణాలు పోయేలా ఉండకూడదు.. ఏదేమైనా ఈ వెర్రి అభిమానం తో ప్రజలు ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో.

Loading...