Friday, March 29, 2024
- Advertisement -

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి

- Advertisement -

స్ట‌న్నింగ్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి.. పెళ్లిపై ఓ షాకింగ్ డిసిష‌న్ తీసుకుంది. త‌న ప్రొఫెష‌న‌ల్‌, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో చాలా క్లారిటీగా ముందుకు వెళ్లే ఈ రౌడీ బేబి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది. ‘పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నాకు నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది. పెళ్లి జరిగితే అనుకున్నట్లు వారి బాగోగులు చూసుకోలేను. అందుకే జీవితంలో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నా’ అని ఓ మీడియా ప్ర‌తినిధి పెళ్లి గురించి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చింది.

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ హైబ్రీడ్ పిల్ల‌.. భానుమ‌తి క్యారెక్ట‌ర్ చేసింది. సేమ్ ఈ పాత్ర కూడా ఇలానే మాట్లాడుతోంది. త‌న తండ్రిని విడిచి వెళ్లడం ఇష్టం లేక ప్రేమించిన వాడిని కూడా కాద‌నుకుంటుంది. మ‌రి క్లైమాక్స్ వ‌చ్చేస‌రికి సీన్ రీవ‌ర్స్ అయిపోతుంద‌నుకోండి. సాయి ప‌ల్ల‌వి లైఫ్‌లో కూడా ఏదైనా అలా మెస్మ‌రైజింగ్ మూమెంట్ జ‌రిగి.. ఆమె మ‌న‌సు మార్చుకునే అవ‌కాశం లేక‌పోలేదు. త‌న త‌ల్లిదండ్రుల‌తోనే క‌లిసే ఉండే వ‌రుణ్ దొర‌క్క‌పోడా? వెచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -