Thursday, March 28, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు క్రేజ్ ముందు సుకుమార్ అహం ఎంత..?

- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు తెలుగులో త‌ప్ప మ‌రో భాష‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా తీయ‌లేదు. కాని ఇండియా మొత్తం మ‌హేశ్ అంటే పిచ్చ క్రేజ్ ఉంది. దానికి కార‌ణం అత‌ని అందం అని వేరేగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియా మొత్తండి మోస్ట్ డిజైర్‌బుల్ అవార్డ్స్‌లో వరుసుగా నాలుగు సార్లు విజేత‌గా నిలిచాడు మ‌హేశ్‌. ఇక తెలుగులో అత‌ని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్నాడు మ‌హేశ్‌. మ‌రి అలాంటి మ‌హేశ్‌తో సినిమా తీయ‌లంటే ఎలాంటి క‌థ‌ను రెడీ చేయాలా అని ద‌ర్శ‌కులు ఆలోచిస్తుంటారు. మ‌రి అలాంటి మ‌హేశ్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చిన వదులుకున్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్‌.

రంగ‌స్థ‌లం వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత మ‌హేశ్ బాబుతో త‌న త‌రువాత సినిమాను అనౌన్స్ చేశాడు సుకుమార్‌. అయితే త‌న క‌థ‌తో మ‌హేశ్‌ను మెప్పించ‌లేక‌పోయాడు. త‌న కోసం వేరే క‌థ‌ను సిద్ధం చేయ‌న్నాడు మ‌హేశ్‌. రంగ‌స్థ‌లం వంటి సినిమా త‌రువాత కూడా తాను చెప్పిన క‌థ‌ను రిజెక్ట్ చేశాడ‌ని మ‌హేశ్‌తో చేసే సినిమా నుంచి స‌డ‌న్‌గా త‌ప్పుకున్నాడు సుకుమార్‌. హ‌డావిడిగా బ‌న్నితో సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది. ఓ స్టార్ హీరో త‌న‌కు క‌థ నచ్చ‌లేదంటే అందులో ఏదో లోపం ఉండి ఉంటుంది. ఒక‌వేళ ద‌ర్శ‌కుడు చెప్పాడు క‌దా అని గుడ్డిగా వెళ్తే అస‌ల‌కే మోసం వ‌స్తోంది. ఈ విష‌యం మ‌హేశ్‌కు బాగా తెలుసు. గ‌తంలో ద‌ర్శ‌కుల‌ను న‌మ్మి గుడ్డిగా వెళ్లి ఫ్లాప్‌ల‌ను ఫేస్ చేశాడు మ‌హేశ్‌.

అస‌లు సుకుమార్‌కు ఇంత‌టి క్రేజ్ రావ‌డానికి కార‌ణం కూడా మ‌హేశ్ బాబే. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి చేసిన 1 నేనొక్కిడినే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయిన‌ప్ప‌టికి , సినిమాలో మ‌హేశ్ న‌ట‌న‌కు, సుకుమార్ ద‌ర్శ‌కత్వనికి చాలా మంచి పేరు వ‌చ్చింది. అస‌లు ఈ సినిమా ద‌గ్గ‌ర నుంచే స్టార్ హీరోలు మ‌హేశ్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. ఇప్పుడు అహంతో మ‌హేశ్‌తో చేయాల్సిన సినిమాను బ‌న్నితో చేసినంత మాత్ర‌నా ఎవ‌రికి న‌ష్టం. గతంలో ఆర్య సినిమా త‌రువాత కూడా సుకుమార్ ఇలానే చేశాడు. జ‌గ‌డం సినిమాను రామ్‌తో చేస్తునప్పుడు ఆ స్టోరీ రామ్ వ‌య‌స్సుకు ఎక్కువ అవుతుంద‌ని ఎంత చెప్పిన విన‌కుండా వేరే నిర్మాణ సంస్థ‌లో జ‌గడం చేశాడు.

తీరా సినిమా బాగుంద‌ని టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి జ‌గ‌డం ప్లాప్‌గా నిలిచింది.ఇలా అహంతో సినిమాలు చేస్తే ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో అంద‌రికి తెలిసిందే. మ‌హేశ్ బాబు క్రేజ్ ముందు సుకుమార్ ఎందుకు ప‌నికి వ‌స్తోంది. ఏది ఏమైనా సుకుమార్ మ‌హేశ్‌తో సినిమాను వ‌దులుకుని చాలాపెద్ద త‌ప్పు చేశాడని ఇండ‌స్ట్రీలో చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -