‘నిశ్శబ్ధం’ అంటున్న అనుష్క చేతులు

290
First Look of Anushka's Nishabdam
First Look of Anushka's Nishabdam

‘భాగమతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు మరొక సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటుడు మైకేల్ మ్యాడ్సన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అనుకున్న విధంగానే ఈ సినిమా టైటిల్ ‘నిశ్శబ్ధం’ అని చెప్తున్న పోస్టర్ లో అనుష్క చేతులు సైన్ లాంగ్వేజ్ లో సైలెన్స్ అని చెబుతున్నట్టు ఉన్నాయి.

సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో అనుష్క పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే టైటిల్ తో 2020లో విడుదల కాబోతున్న ఈ సినిమా తమిళ్ మరియు హిందీ భాషలలో కూడా తెరకెక్కనుంది. చాలా కాలం తర్వాత అనుష్క మళ్ళీ నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Loading...