సినీ ర‌చ‌యిత ఆత్మ‌హ‌త్య‌

428
Flim Author commit suicide
Flim Author commit suicide

ముంబయికి చెందిన సినీ రచయిత ఆత్మహత్య పాల్పడ్డాడు.ముంబయికి చెందిన రవిశంకర్ అలోక్ (32) పలు హిందీ సినిమాలకు రచయితగా పనిచేశారు.అత‌ను బహుళ అంతస్థు భవనంపై నుంచి రాత్రి 2 గంటల సమయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

బుధవారం రాత్రి 2 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో అటువైపు వెళ్లిచూసే సరికి అలోక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని వాచ్‌మెన్ వెల్లడించాడు. తక్షణమే అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు కూడా చేరుకున్నారని తెలియజేశాడు. గతేడాది నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న అలోక్, ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.

 

Loading...