Friday, April 26, 2024
- Advertisement -

రాఘవ లారెన్స్ పేరుతో మోసం!

- Advertisement -

సౌత్ చలన చిత్ర పరిశ్రమ లో పేరున్న వాళ్ళ లో ఒకరు రాఘవ లారెన్స్. ఆయన ఎప్పటికప్పుడు ఎన్నో ఛారిటీ పనులు, అలాగే సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన పేరు చెప్పి ఒక మోసగాడు మెడికల్ సీట్ ఇప్పిస్తామని రూ.18 లక్షలకు ఓ వ్యక్తి కి టోకరా వేసాడట. అయితే లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలని ఒక ట్రస్ట్ స్థాపించి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలా జరగడం తో ఒక్కసారిగా లారెన్స్ తో పాటు ట్రస్ట్ కి సంబందించిన మిగిలిన వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యారు.

ఇదంతా చేసింది ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అని, అతడు ఒక మెడికల్ స్టూడెంట్ కి సీట్ ఇప్పిస్తా అని చెప్పి రాఘవ లారెన్స్‌ నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు ఉపాధ్యక్షుడినని చెప్పి ఆమెని నమ్మించి డబ్బు ఎత్తుకుపోయారు. ఆయన కి వారు ముందుగా రూ.4.5 లక్షలు పంపారు. ఆ తర్వాత హాస్టల్ ఫీజ్, ఇతర ఖర్చు అంటూ మిగిలిన డబ్బుని పంపించారు. ఆ తర్వాత మెల్లగా అనుమానం వచ్చి అసలు విషయం ఆరా తీయగా ఇలా జరిగింది అని వారు గ్రహించారు. ఇక ఇప్పుడు ఈ కేసు పోలీసుల సమక్షం లో ఉంది. ఏం జరుగుతుంది అనే దాని పైన ఎవరికీ ప్రస్తుతం క్లారిటీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -