Friday, April 19, 2024
- Advertisement -

‘గద్దలకొండ గణేష్’ ఫోర్ డేస్ కలెక్షన్స్

- Advertisement -

ఇంతకుముందెన్నడూ కనిపించనటువంటి మాస్ పాత్రలో మెగా హీరో వరుణ్ తేజ్ ఒక గ్యాంగ్ స్టర్ గా ‘గద్దలకొండ గణేష్’ అనే సినిమాలో నటించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా విడుదలైన ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ నటుడు అధర్వ మురళి ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు మృణాలినీ రవి హీరోయిన్లుగా నటించారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 20న విడుదలైంది.

విడుదలకు ముందు నుంచే సినిమాపై మంచి హైప్ ఉండడంతో సినిమా ఓపెనింగ్ డే రోజున మంచి వసూళ్లను అందుకుంది. ఆ తరువాత కూడా అదే జోరును కనబరుస్తూ మంచి వర్డ్ ఆఫ్ మౌత్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 17.10 వేల కోట్ల షేర్ ను అందుకోగా మొత్తంగా 27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రైట్స్ 24.25 ఐదు కోట్లకు అమ్ముడయ్యాయి కాబట్టి 25 కోట్ల ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా మరొక 7.9 కోట్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుతుంది. ఎలాగో ఈవారం పెద్దగా పోటీ ఏమీ లేదు కాబట్టి ‘గద్దలకొండ గణేష్’ టార్గెట్ సులువుగా రీచ్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వాల్మీకి (గద్దలకొండ గణేష్) సినిమా నాలుగో రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

నిజాం: 5.55 కోట్లు

సీడెడ్: 2.35 కోట్లు

యూఏ: 1.86 కోట్లు

ఈస్ట్: 1.20 కోట్లు

వెస్ట్: 1.06 కోట్లు

గుంటూరు: 1.35 కోట్లు

కృష్ణ: 1.05 లక్షలు

నెల్లూరు: 57 లక్షలు

ఏపీ+తెలంగాణ: 14.99 కోట్లు

కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 85 లక్షలు

ఓవర్సీస్: 1.26 కోట్లు

టోటల్: 17.10 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -