Friday, April 26, 2024
- Advertisement -

రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతున్న గద్దలకొండ గణేష్

- Advertisement -

తమిళ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాని తన స్టైల్ మార్పులతో గద్దలకొండ గణేష్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. క్లాస్ హీరో వరుణ్ తేజ్ ని విలన్ గా చేసి, హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ని పెట్టి హరీష్ శంకర్ గట్టి హిట్టు కొట్టాడు. వరుణ్ విలన్ గా చేస్తున్నాడు అని తెలియగానే టాలీవుడ్ ఇండస్ర్టీ మొత్తం వింతగా చూసింది, కానీ వరుణ్ అలా ప్రయోగాలు చేస్తూ తనని తాను మంచి నటుడిగా మలుచుకుంటున్న తీరు అందరిని నోళ్ళని కట్టిపడేసింది. మొన్న రిలీజ్ అయిన రోజు నుంచే మంచి టాక్ సంపాదించుకొని వసూళ్ళ బాటలో నడుస్తుంది.

మాస్ మూవీ అయినప్పటికీ క్లాస్ ఆడియన్స్ నుండి కూడా స్పందన బావుండడంతో ఆదివారం మరింత పుంజుకుని మూడో రోజు కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేసేలా కనిపిస్తున్నాడు గద్దలకొండ గణేష్. ఇప్పుడు ప్రేక్షకులకు ఉన్న బెస్ట్ ఆప్షన్ గద్దలకొండ గణేష్ మాత్రమే. సూర్య బందోబస్త్, నానీస్ గాంగ్ లీడర్ రెండు గద్దలకొండ గణేష్ వచ్చాక వెనుకబడిపోయాయి. సినిమా రెగ్యలర్ గా లేకపోవడం, మంచి కథ, కథనం తో గద్దలకొండ గణేష్ మంచి వసూళ్ళు అందుకుంటుంది.

గద్దలకొండ గణేష్ సినిమా USA కలెక్షన్స్
ప్రీమియర్స్- 84,900 డాలర్లు
శుక్రవారం-79,700 డాలర్లు
శనివారం- 107,800 డాలర్లు
ఆదివారం- 52,800 డాలర్లు
మొత్తంగా 352,200 డాలర్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -