Thursday, March 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన గంగవ్వ..!

- Advertisement -

మై విలేజ్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది గంగవ్వ. రీసెంట్ గా బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి వెళ్ళి అందరినీ సర్ ఫ్రైజ్ చేసింది. తెలంగాణ యాసలో అమట్లాడుతూ లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెని ఇంటి సభ్యులు, బిగ్ బాస్ మంచిగా చూసుకున్నారు.

అయితే అనారోగ్యం కారణంగా ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగలేకపోయింది. సొంత ఇల్లే లక్ష్యంగా ‘బిగ్ బాస్’ హౌస్ కు వెళ్ళబోతున్నట్టు గంగవ్వ ముందు తెలిపిన విషయం తెలిసిందే. ఈమె ‘బిగ్ బాస్4’ విన్నర్ గా నిలవకపోయినా.. హోస్ట్ నాగార్జున ఈమెకు సొంత ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే ఇంటి పనులు మొదలుపెట్టారని గంగవ్వ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొత్త ఇంటికి సంబంధించి ఆమెకు ఫోన్లు మెసేజ్ లు వస్తున్నాయని ఆమె తెలిపింది.

హౌస్ నుండి బయటకు వచ్చినప్పటికి.. బిగ్ బాస్ డాక్టర్లు ఆరోగ్యం ఎలా ఉందని ఫోన్లు చేసి కనుకుంటున్నారని గంగవ్వ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇదే నేపథ్యంలో ’బిగ్ బాస్ 4’లో విన్నర్ ఎవరవుతారు అనే ప్రశ్నకు షాకింగ్ జవాబు ఇచ్చింది గంగవ్వ. హౌస్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ గేమ్ ఆడుతున్న అవినాషే విన్నర్ అవుతాడని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిజానికి అవినాష్ తన కామెడీతో ఇంటి సభ్యులను ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. మరి గంగవ్వ చెప్పింది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?

బన్నీ ఫాన్స్ లో ఆందోళన మొదలవుతుందట..

సంగీతకు లైన్ వేసిన శేఖర్ మాస్టర్.. రోజా ఫైర్..!

బొమ్మ‌బ్లాక్ బ‌స్ట‌ర్ ఆడియో ఫ‌స్ట్ సింగిల్ ను విడుద‌ల చేసిన మెగా ప్రిన్స్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -