గంగోత్రి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ను ఇప్పుడు చూశారా ?

8564
Gangotri movie child artist Kavya
Gangotri movie child artist Kavya

చిన్నపిల్లలు ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంటుంది. ఇక వాళ్ళ ముద్దు ముద్దు మాటలతో యాక్టింగ్ చేస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టీస్లు తమ క్యూట్ నెస్ తో యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. మనం ఇప్పుడు తన క్యూట్ స్మైల్ నటనతో ఎంతో మంది అభిమానాన్ని గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

కావ్యా ఎవరనుకుంటున్నారా ? గంగోత్రి సినిమాలో చిన్నప్పటి అదితి అగర్వాల్ గా వల్లంగి పిట్ట సాంగ్ లో కనిపించిన అమ్మాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో చేసిన కావ్య ఆఫర్స్ వస్తున్నా కానీ ఇండస్ట్రీకు దూరంగా ఉంది. చదువు కోసం యాక్టింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది కావ్య. చదువుకుంటూనే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. చాలా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. రీసెంట్ గా పూణేలో బిఏ, ఎల్ఎల్‍బి పూర్తి చేసి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది కావ్య.

ఇన్ని రోజులు ఇండస్ట్రీకు దూరంగా ఉన్న కావ్య ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. హీరోయిన్ గానే కాకుండా సిస్టర్ రోల్స్.. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న ఏ రోల్ అయిన సరే చేసేందుకు సిద్దం అంటుంది. కావ్య లేటేస్ట్ ఫొటోస్‍లో చాలా అందంగా చూడముచ్చటగా కనిపిస్తోంది. రీసెంట్ గా చేయించుకున్న ఫోటో షూట్ నుంచి కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

Loading...