Tuesday, April 16, 2024
- Advertisement -

కమల్ హసన్ తో గౌతమి విడిపోయింది!

- Advertisement -
gautami said baibai to kamal

హీరో కమల్ హాసన్, గౌతమి జంటను స్టార్ కపుల్స్‌లో ఒకరుగా మెచ్చుకుంటారు అందరు. సినిమాల్లో నటించే సమయంలోనుంచే వీరు స్నేహంగా ఉండేవారు. అయితే క‌మ‌ల్ భ‌ర‌త‌నాట్యకారిణి వాణీ జ‌య‌రామ్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. త‌ర్వాత శృతీహాస‌న్ తల్లి సారిక‌ను రెండో పెళ్లి చేసుకుని ఆమెతో శృతి-అక్ష‌రల‌ను క‌న్నాక ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు. అయితే కమల్, గౌతమి 2005 నుంచి సహజీవనం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

దాదాపు పదమూడు ఏళ్ళు కలిసి ఉన్న ఈ జంట విడిపోతున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా నిర్దారిస్తూ గౌత‌మి ఓ ప్ర‌క‌ట‌న కూడా రిలీజ్ చేశారు. కమల్ హాసన్‌తో తన 13 ఏళ్ళ బంధానికి తెరపడిందని, ఇకపై తాము కలిసి ఉండడం లేదని ఆమె అన్నారు. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా బాధాక‌ర‌మైనా త‌ప్ప‌డం లేద‌ని ఆమె తెలిపారు. ఇద్ద‌రి ఆలోచ‌న‌లు భిన్నంగా మారిపోయాక క‌లిసి ఉండ‌లేమ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపారు.

కమల్ తో విడిపోవడానికి తాను చాలా కాలం ఆలోచించానని.. కమల్ తో సినిమాలకు పని చేసినందుకు నేనూ చాలా గర్వంగా భావిస్తున్నా. భవిష్యత్‌లో ఆయన ఫిల్మ్‌మేకర్‌గా పొందే సక్సెస్‌లను అభినందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఈ నిర్ణయం కఠినమైనదే అయినా తీసుకోక తప్పడం లేద‌న గౌత‌మీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Related

  1. అనసూయ, రష్మీ మధ్య వివాదం?
  2. రోజాకు బాలయ్యతో దీపావళి చాలా స్పెషల్!
  3. సునీల్‌ మీద ఘోరంగా కుట్ర జరుగుతోంది?
  4. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -