Thursday, April 25, 2024
- Advertisement -

గీతాఆర్ట్స్ చేతిలో పలాస 1978

- Advertisement -

మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహిస్తూ విడుదల చేయడంలో సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ పోటీపడుతున్నాయి. అందులో మొదటి వరుసలో ఉండే సురేష్ ప్రొడక్షన్స్ పెళ్లిచూపులు, కెరాఫ్ కంచెరపాలెం, రాజావారు రాణిగారు సహా ఎన్నో సినిమాలను విడుదల చేసి కొత్తవాళ్ల ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేసింది.

అదే దారిలో వెళ్తోన్న గీతాఆర్ట్స్ యూవీ క్రియేషన్స్ తో కలిసి చిన్న చిత్రాలను ప్రొత్సహించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో 1978లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ పలాస చిత్రాన్ని విడుదల చేసేందుకు జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ ముందుకొచ్చాయి.

పలాస చిత్రాన్ని చూసిన అల్లు అరవింద్, బన్నీవాసు, వంశీ లకు బాగా నచ్చింది. దీంతో ఆ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి చివరి వారంలో “పలాస”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో ద్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించగా రఘు కుంచె సంగీతాన్ని అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -