పెద్ద షాక్ లో ఉన్న స్టార్ దర్శకుడు

181
GHMC Gives Big Shock To Director VV Vinayak
GHMC Gives Big Shock To Director VV Vinayak

వివి వినాయక్ టాలీవుడ్లోని పాపులర్ దర్శకులలో ఒకరు. అయితే గత కొంతకాలంగా వినాయక కెరీర్ లో పెద్దగా హిట్లు అంటూ ఏమీ లేవు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ వి.వి.వినాయక్ కి దక్కలేదు. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా వినాయక్ కు గట్టి షాక్ తగిలింది. గతంలో వి.వి.వినాయక్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లా కొనుక్కున్నారు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ బిల్డింగ్ కాస్త అమ్ముకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఈ మధ్యనే వి.వి.వినాయక్ నర్సింగి ఏరియాలో ఒక పెద్ద ఇంటిని కట్టుకోవాలని అనుకున్నారు. దానికి సంబంధించి పనులు కూడా మొదలు పెట్టేసారు. కొంత కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఆ ప్రాంతం గో 111 కిందకి రావడంతో టౌన్ ప్లానింగ్ అధారిటీ వాళ్లు ఆ ప్రాపర్టీని సీజ్ చేసి అప్పటి వరకు జరిగిన కన్స్ట్రక్షన్ మొత్తం పడగొట్టారు. అంతకుముందు వినాయక్ కు ఎన్ని నోటీసులు పంపించినా అతను రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళు ఈ పని చేయాల్సి వచ్చింది. మరోవైపు వినాయక సినిమాలలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. వి.వి.వినాయక్ తదుపరి సినిమా గురించి ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు.

Loading...