Tuesday, April 23, 2024
- Advertisement -

టీజర్ టాక్: చాణక్య

- Advertisement -

గత కొంతకాలంగా మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్ లో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఈ మధ్యనే గోపీచంద్ 25వ సినిమాగా విడుదలైన ‘పంతం’ కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఇప్పుడు అనే ‘చాణక్య’ ఒక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు గోపీచంద్. ఈ సినిమాకి కోలీవుడ్ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ‘పంతం’ సినిమా లో హీరోయిన్ గా నటించిన మెహరీన్ పిర్జాదా ఈ సినిమాలో రెండవసారి గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు.

నిడివి తక్కువగా ఉన్నప్పటికీ టీజర్ సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని హింట్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో ఎంతవరకు విజయం సాధిస్తాడు అని ఇంకా తెలియాల్సి ఉంది. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -