Friday, April 19, 2024
- Advertisement -

తొలి షెడ్యూల్ పూర్తి చేసిన ‘గోపీచంద్’..!.

- Advertisement -

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్ర్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకి రానుంది.

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -