Friday, March 29, 2024
- Advertisement -

గుణ 369 రివ్యూ: సామాజానికి ఉపయోగపడే సినిమా…

- Advertisement -

టైటిల్ : గుణ 369
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్‌, ఆదిత్య, నరేష్‌, హేమ
సంగీతం : చైతన్‌ భరద్వాజ
దర్శకత్వం : అర్జున్‌ జంద్యాల
నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు

కథ:
గుణ (కార్తికేయ) జీవితాన్ని సాఫీగా గడుపుతున్న సమయం లో గీత (అనఘా) అనే అమ్మాయి తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమ గా మారుతుంది. ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటున్న సమయం లో కొన్ని అనుకోని సంఘటనల వలన గుణ జైలు వెళ్ళవలసి వస్తుంది. ఆ సంఘటన తో ఒక్కసారిగా గుణ జీవితం చిన్న భిన్నం అవుతుంది. అసలు గుణ జీవితం లో కష్టాలేంటి? తను అటువంటి పరిస్థితులని ఎందుకు ఎదుర్కొన్నాడు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.

నటీనటులు:
ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపుతూ ముందుకు దూసుకుపోతున్న యువ హీరో కార్తికేయ గుమ్మ కొండ ఈ సినిమాలో కూడా సరి కొత్త లుక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎక్స్ ప్రెషన్లు, డైలాగ్ డెలివరీ వంటి వాటిల్లో బాగా అనుభవం తెచ్చుకున్న కార్తికేయ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా చాలా బాగా నటించాడు. అనాఘా కేవలం తన అందంతో మాత్రమే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. తనది అంత పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినా తన పాత్ర పరిధి మేరకు అనాఘా చాలా బాగా నటించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్తికేయ తో చాలా మంచి కెమిస్ట్రీ మైంటైన్ చేసింది. ఆదిత్య మీనన్ విలన్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఆదిత్య మీనన్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ సినిమాకి మరింత ప్లస్ అయింది. ‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ ఆచంట ఈ సినిమాలో కార్తికేయ ఫ్రెండ్ పాత్రలో బాగానే నటించాడు. మొదటి హాఫ్ లో మహేష్ కామెడీ చాలా బాగుంటుంది. మంజుభార్గవికి ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది మరియు ఆమె తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమా కోసం ఒక మంచి కథను సిద్ధం చేశారు. అయితే కథ బాగా రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు సినిమాతో అంతగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. తెలిసిన స్టోరీ అయినప్పటికీ దానికి కామెడీ, రొమాన్స్ ని జత చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు. కథ సంగతి పక్కన పెడితే దర్శకుడు కథని నెరేట్ చేసిన విధానం బాగానే ఉంటుంది. అనిల్ కడియాల మరియు తిరుమల్ రెడ్డి అందించిన నిర్మాణ విలువలు సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు మూడు పాటలతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన చైతన్ భరద్వాజ్ సినిమాలో తన అద్భుతమైన నేపథ్య సంగీతంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తాడు. రామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ని హైలైట్ చేస్తూ సినిమాటోగ్రాఫర్ రామ్ చక్కని పనితనాన్ని కనబరిచాడు. తమ్మి రాజు ఎడిటింగ్ కూడా చాలా బాగుంది.

తీర్పు:
సినిమాలో రొటీన్ కథ ఉండటం అతి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగానే మొదలైన ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం కామెడీ మరియు రొమాన్స్ తో నిండిపోతుంది. ఫ్రెష్ కామెడీ ఉన్నప్పటికీ ప్రేక్షకులు సినిమాతో అంతగా కనెక్ట్ అవ్వలేక పోవచ్చు. మరోవైపు ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఇక రెండవ హఫ్ కొంచెం స్లో గా సాగడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు చాలా చిరాకు తెప్పిస్తాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. యాక్షన్ నచ్చే ఆడియన్స్ పరిస్థితి ఎలా ఉన్నా మిగతా ప్రేక్షకులకి మాత్రం బోర్ కొడుతుందని చెప్పచ్చు. కార్తికేయ నటన మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని ప్లస్ పాయింట్స్ కాగా రొటీన్ కథ, స్లో స్క్రీన్ ప్లే సినిమాకి మైనస్ పాయింట్లు. చివరగా ‘గుణ 369’ సినిమా కేవలం కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే అలరించగల చిత్రం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -