Tuesday, April 23, 2024
- Advertisement -

గుణ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్న కార్తికేయ

- Advertisement -

యువహీరో కార్తికేయ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తో పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. కానీ ఆ విజయాన్ని ఆస్వాదించే లోపే కార్తికేయ నటించిన ‘హిప్పీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. తాజాగా కార్తికేయ ఇప్పుడు ‘గుణ 369’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా లో అనాఘ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా మారతాయని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.

సినిమా గురించి మాట్లాడుతూ ‘గుణ 369’ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయని హీరో కార్తికేయ చెబుతున్నాడు. మరోవైపు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘గుణ 369’ సినిమా రేపు అనగా ఆగస్టు 2న విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా కార్తికేయ మంచి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా కాకుండా కార్తికేయ నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా లో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -