పూజ హెగ్డే గ్లామర్ కామెంట్లు బాధ పెట్టాయి అంటున్న హరీష్ శంకర్

264
Harish Shankar Comments On Pooja Hegde's Glamour
Harish Shankar Comments On Pooja Hegde's Glamour

డైరెక్టర్ హరీష్ శంకర్ త్వరలో ‘వాల్మీకి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయినా ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అథర్వ మురళి మరియు మృణాలినీ రవి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “డిజె సినిమా హిట్ అవడానికి గల కారణం పూజా హెగ్డే గ్లామర్ అని అన్నప్పుడు నేను బాధ పడ్డాను. అందుకే ఇప్పుడు పూజ కోసం నేను శ్రీదేవి అనే మంచి పాత్రను రాసి ఇచ్చాను” అని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.

ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ పూజా హెగ్డే ‘డిజె’ సినిమాలో చూపించిన గ్లామర్ వల్లనే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ‘వాల్మీకి’ సినిమాలో ఈమెది గ్లామరస్ పాత్ర అయినా కాకపోయినా ఈమె గ్లామర్ తోనే స్టార్ హీరో లతో సినిమా ఆఫర్లు సాధిస్తోంది.

Loading...