Friday, March 29, 2024
- Advertisement -

కొత్త సినిమా పై క్లారిటీ ఇవ్వని దర్శకుడు

- Advertisement -

తన చిత్రం వాల్మీకి విడుదల కి సిద్ధం గా ఉన్న కారణం గా కామెంట్ చేశాడా లేక నిజంగా నే తన మనసులో ఉన్న మాట చెప్పాడా తెలియదు కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఎలాగైనా సరే చిరంజీవి జీవితం ఆధారం గా ఒక సినిమా చేయాలి అని మాత్రం అనుకుంటున్నారు. అయితే ఈ ప్రకటన చేసిన వెంటనే చాలా మంది పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. హరీష్ నిజంగా నే ఈ ప్రాజెక్ట్ చేస్తారా, హరీష్ సీరియస్ గా నే ఈ సినిమా గురించి చెప్తున్నారా, అసలు నిజంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా, దానికి చిరంజీవి అనుమతి ఇస్తారా వంటి డవుట్స్ ని చాలా మంది అలా డవుట్స్ గా నే ఉంచేశారు.

ఆ విషయం పక్కన పెడితే హరీష్ శంకర్ తన నెక్స్ట్ సినిమా గురించి మాత్రం ఒక ప్రకటన ఇంకా చేయలేదు. నిజానికి హరీష్ శంకర్ తో సినిమా చేసేందుకు ఒక్క హీరో కూడా ఇంకా ముందుకు రాలేదు. అలంటి చర్చ కూడా హరీష్ మొదలు పెట్టలేదు.

హరీష్ మాత్రం వాల్మీకి సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూస్తాను అని చెప్పి, తన కొత్త సినిమా ప్రకటన ఆ తర్వాత ఇస్తాను అని హరీష్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -