Friday, March 29, 2024
- Advertisement -

హరీష్ శంకర్ తో చిరంజీవి సినిమా?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన నూతన చిత్రం సై రా నరసింహ రెడ్డి కి సంబందించిన ప్రమోషన్స్ తో బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే క్లారిటీ ఎవ్వరికీ లేదు. ఈ సినిమా ని త్వరగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది కానీ ఏదీ ఒక పట్టాన తెగడం లేదు. ఇకపోతే ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ రేపటి నుంచి మొదలు కానున్నాయి.

ఇక అది పక్కన పెడితే, మెగా స్టార్ తన నెక్స్ట్ సినిమా ని కొరటాల శివ దర్శకత్వం లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవలే చిరంజీవి తన లుక్ ని కూడా మార్చేసుకున్నారు. ఈ విషయం ఇప్పటికే ఇండస్ట్రీ లో ఒక రేంజ్ లో రచ్చ చేస్తుంది. ఏ రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, యువ దర్శకుడు హరీష్ శంకర్ కొరటాల శివ ని చూసి కుళ్ళుకుంటున్నట్టు పబ్లిక్ గా చెప్పారు.

అయితే హరీష్ శంకర్ కూడా ఎప్పటి నుంచో చిరంజీవి తో పని చేయాలని భావిస్తున్నారట. త్వరలో నే చిరంజీవి ని కలిసి ఒక కథ చెప్పనున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -