Friday, April 19, 2024
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కి గుండెపోటు?

- Advertisement -

దక్షిణ భారత దేశ సినిమా పరిశ్రమ లో మణిరత్నం స్టార్ డైరెక్టర్. ఆయన అన్ని జెనరేషన్ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు చేసి విజయాన్ని కూడా ఆస్వాదించారు. ఇప్పటికీ ఆయన సినిమా వస్తుంది అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన కి ఈ మధ్య సహకరించడం లేదు అని తెలుస్తుంది. తాజా చెన్నై ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఆయన కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందట. అతని సన్నిహిత వర్గాలు వెంటనే చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌ కు తరలించారట. అయితే ఆరోగ్య పరిస్థితి మీద ప్రస్తుతం అధికారిక సమాచారం లేదు కానీ ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడ గా ఉంది అని తెలుస్తుంది.

అయితే ఇలా గుండెపోటు రావడం మణిరత్నం కి ఇది నాలుగోసారి అని తెలుస్తుంది. అయితే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మణిరత్నం ఆరోగ్యం విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలో మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ పొన్నియన్‌ సెల్వన్‌ అనే హిస్టారికల్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కోసం భారీ ఎత్తున నటీనటుల్ని ఎంపిక చేసుకోనున్నారు అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -