Friday, March 29, 2024
- Advertisement -

’24 కిస్సెస్’ మూవీ రివ్యూ

- Advertisement -

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల‌లో అడ‌ల్డ్ క‌థ‌ల‌కు మంచి డిమాండ్ ఉండ‌టం,అవి మంచి విజ‌యాలు సాధించ‌డంతో అటువంటి సినిమాకు ఎక్కువుగా తెర‌కెక్కుతున్నాయి.కూమా21ఎఫ్ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన హీరోయిన్హె బ్బా ప‌టేల్‌,త‌రువాత అనుకున్నంత సక్సెస్ కాలేదు.దీంతో ఈ భామ కూడా అడ‌ల్డ్ క‌థ వైపు మొగ్గు చూపి 24 కిస్సెస్ సినిమా చేసింది.టీజ‌ర్ ,ట్రైల‌ర్‌లోనే సినిమా క‌థ ఎంటో చూపించారు ద‌ర్శ‌కుడు. యూత్‌ని టార్గెట్ చేసుకుని వ‌చ్చిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…

క‌థ: ఆనంద్ (అరుణ్ అదిత్‌) చిన్న పిల్ల‌ల చిత్రాలు తీసే ద‌ర్శ‌కుడు. పెళ్లంటే న‌మ్మ‌కం లేని వ్య‌క్తిత్వం. ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం ఉంటుంది కానీ… ప్రేమ‌లో మాత్రం ప‌డ‌డు. ఇద్ద‌రి మ‌ధ్య బంధానికి ఏదో ఒక పేరు ఉండాల్సిందేనా? అంటుంటాడు. అనుకోకుండా మాస్ క‌మ్యూనికేష‌న్ చదువుతున్న శ్రీల‌క్ష్మి (హెబ్బా ప‌టేల్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. శ్రీల‌క్ష్మి అది ప్రేమే అంటుంది. ఆనంద్ మాత్రం ప్రేమ కాదంటాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరుగుతుంది. ఆ త‌ర్వాత ఆనంద్ మ‌ళ్లీ శ్రీల‌క్ష్మిని క‌లిశాడా? లేదా? అత‌ని మ‌న‌సులో ప్రేమ ఎప్పుడు పుట్టింది? ప్రేమ పుట్టినా పెళ్లంటే న‌మ్మ‌కం లేని అత‌ని జీవితంలో ఎలాంటి గంద‌ర‌గోళం చోటు చేసుకుంది? అస‌లు పెళ్లంటే అత‌నికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌ :నేటిత‌రం మ‌ధ్య బంధాల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దాన్ని ద‌ర్శ‌కుడు 24 ముద్దుల‌తో ముడిపెట్టాడు. స్వ‌త‌హాగా చిన్న పిల్లల నేప‌థ్యంలో సాగే ఓ సినిమా తీసిన ఆయ‌న ఆలోచ‌న‌ల్ని, స్వీయానుభా‌వాల్ని రంగ‌రించాడు. క‌థ‌లో ఎన్ని విష‌యాలు చెప్పినా సినిమాలో ఏదీ అత‌క్క‌పోగా… ఆద్యంతం గంద‌ర‌గోళంగా సాగుతుంది. ద‌ర్శ‌కుడు అస‌లు ఈ సినిమాతో ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడ‌నే విష‌యం ఒక ప‌ట్టాన ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. ఒక సినిమా చూస్తున్న‌ప్ప‌డు అందులో హాస్య‌మో, భావోద్వేగాలో.. లేదంటే ఆస‌క్తో ఇలా ఏదో ఒక అనుభూతి క‌ల‌గాలి. కానీ ఈ సినిమా చూస్తున్నంత‌సేపు.. ఎంత‌సేపు ఈ సాగ‌దీత అనే అభిప్రాయం క‌లుగుతుంది త‌ప్ప ఏ ద‌శ‌లోనూ ఆక‌ట్టుకోదు. ఆనంద్ త‌న బాధ‌ని సైకో థెర‌పిస్ట్ అయిన మూర్తితో చెప్పుకోవ‌డంతో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య బంధానికి ప్రేమ‌, పెళ్లి అనే పేరు పెట్టాల్సిన అవ‌స‌రమే లేద‌నే ఆలోచ‌న‌లున్న క‌థానాయకుడు… ప్రేమ‌పైనా, పెళ్లిపైనా న‌మ్మ‌క‌మున్న క‌థానాయిక మధ్య సంఘ‌ర్ష‌ణే ఈ చిత్రం. ఇద్ద‌రూ శారీర‌కంగా ఒక్క‌ట‌య్యాక భిన్న అభిప్రాయాలున్న వాళ్లు ఎంత దూరం ప్ర‌యాణం చేశార‌నేది క‌థాంశం. దానికి ద‌ర్శ‌కుడు త‌న‌దైన క‌వితాత్మ‌క‌త‌ని జోడించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఆ క‌థ‌నం ఒక ప‌ట్టాన అర్థం కాదు. దాంతో ఆద్యంతం గంద‌ర‌గోళ‌మే. చివ‌రికి ప్రేమ‌ని రుచి చూశాన‌న్న క‌థానాయ‌కుడు మ‌ళ్లీ పెళ్లి ద‌గ్గ‌రికొచ్చేస‌రికి న‌మ్మ‌కం లేదంటాడు. దాంతో అక్క‌డ పెళ్లెందుకు ఇష్టం లేద‌ని మ‌రో క‌థ ఉంటుంది. ఆ ప్ర‌హ‌సనం అంతా సాగ‌దీత‌గా అనిపిస్తుంది త‌ప్ప వినోదం కానీ, భావోద్వేగాలు కానీ పంచ‌దు. పేరులోనే ముద్దుల్ని చొప్పించిన ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించొచ్చు కానీ… థియేట‌ర్‌లో మాత్రం మెప్పించ‌లేడు. క‌థ‌, క‌థ‌నాల్లో లోపాల వ‌ల్ల తెర‌పై ముద్దులు కూడా తేలిపోయాయి.

న‌టీన‌టుల ఫ‌ర్మామెన్స్‌: అదిత్ అరుణ్, హెబ్బా ప‌టేల్‌ల న‌ట‌న బాగుంది. పాత్ర‌లకి త‌గ్గ‌ట్టుగా ప‌రిణ‌తితో న‌టించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. సినిమా ప్ర‌ధానంగా నాలుగు పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. రావు ర‌మేశ్‌ సైకో థెరపిస్ట్‌గా క‌థ‌ని న‌డిపించే పాత్ర‌లో క‌నిపిస్తారు. అదితి మ్యాక‌ల్ న‌వ‌త‌రం అమ్మాయిగా క‌నిపిస్తుంది. న‌రేశ్‌ క‌థానాయిక తండ్రిగా న‌ట‌న‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. జోయ్ బారువా స‌మ‌కూర్చిన పాట‌ల్లో రెండు పాట‌లు మాత్రమే బాగున్నాయి. ఉద‌య్ గుర్రాల కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ క‌థకుడిగా, దర్శ‌కుడిగా విఫ‌ల‌మ‌య్యారు. త‌న మేధో సంపత్తినంతా ఉప‌యోగించి సినిమాని గంద‌ర‌గోళంగా మార్చేశారు. కొన్ని చోట్ల మాట‌లు ఆక‌ట్టుకుంటాయంతే.

బోట‌మ్ లై న్‌: ముద్దుల వ్య‌థ!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -