Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్ బాస్ పై హేమ ఆరోపణలు

- Advertisement -

నిన్న సాయంత్రం బిగ్ బాస్ షో లో జరిగిన ఎలిమినేషన్ కార్యక్రమం లో హేమ బయటకు వచ్చేసింది. ఓట్లు తనకి అనుకూలం గా లేకపోవడం తో అందరూ హేమ ని ఇంటి నుంచి బయటకి పంపేశారు. వెళ్లిపోయేప్పుడు ఇంటి వాళ్ళు తనని తప్పుగా అర్ధం చేసుకున్నారు అని హేమ చెప్పింది. అయితే ఇక బయట ప్రపంచానికి తిరిగి వచ్చిన హేమ బిగ్ బాస్ లో తన అనుభవాన్ని పంచుకునేందుకు మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది. అందులో భాగం గా, బిగ్ బాస్ నిర్వాహకుల పై ఆరోపణలు చేసింది హేమ.

“బిగ్ బాస్ లో ఉన్నది ఉన్నట్టుగా చూయించడం లేదు. నాపై ముందు నుంచే నిర్లక్ష్యంగా వ్యవహరించారు అందరూ. స్టార్టింగ్ రోజు నా AV కూడా వేయలేదు. లోపల జరిగిన గొడవ వేరే, ఆ గొడవ జరిగినప్పుడు నేనే సర్దిచెప్పాను కానీ తీరా చూస్తే నేనే గొడవపడ్డట్టు ప్రసారం చేశారు. నాకు గూగుల్ లో ఎక్కువ ఓట్స్ వచ్చాయి. కానీ హోట్స్టార్ లో మాత్రమే ఓట్ వేయాలని క్లియర్ గా చెప్పలేదు. నన్ను ప్రమోట్ చేసేలా ప్రోమో వేస్తామన్నారు కానీ అది కూడా లేదు. ఈ విషయం లో నాకు క్లారిటీ ఇవ్వమని నేను మాటీవీ వాళ్ళను అడిగాను. నన్ను అక్క అక్క అంటూనే, నా పై అందరూ లేనిపోని మాటలు చెప్పారు. ప్లాన్డ్ గా నన్ను బయటకు పంపేలా చేశారు.” అని హేమ ఆరోపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -