Friday, April 19, 2024
- Advertisement -

నితిన్, కళ్యాణ్ రామ్‌ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!

- Advertisement -

మంచు విష్ణు తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. నితిన్ కళ్యాణ్ రామ్‌ ఇద్దరూ రాస్కెల్స్. వాళ్లకి ఇప్పటివరకూ నాలుగు సినిమాలు ఆఫర్ చేశా కలిసి చేద్దాం అని. కానీ రిజెక్ట్ చేశారు. ఇక సుమంత్ కనిపిస్తే గొంతు పిసికేయాలి అనుకుంటా. నా కొత్త సినిమా ‘మోసగాళ్లు’లో కూడా చేయమని చెప్పా.

చేయనని అన్నాడు. ఈ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అన్నాడు. నాకు మల్టీస్టారర్ చేయడం బాగా ఇష్టం. ఈడోరకం-ఆడోరకం సినిమా కోసం ఫస్ట్ కళ్యాణ్ రామ్‌ని అడిగా. కానీ ఒప్పుకోలేదు. నితిన్‌తో 10-12 ఏళ్లుగా చేయాలని అనుకుంటున్నా. కానీ కుదరడం లేదు. కానీ నితిన్‌కి హిట్ వస్తే.. నాకు వచ్చినట్టే. ఎందుకంటే స్ట్రగుల్ అంటే ఏంటో బాగా తెలిసినవాడు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. భీష్మ సినిమా విడుదల కాగానే కంగ్రాట్స్ బ్రదర్ అనగానే.. నువ్ సినిమా చూసి ఫోన్ చేయి అన్నాడు. నాకు వేరే షూటింగ్స్ వల్ల చూడలేకపోయా. మా ఫ్యామిలీ మొత్తం నేను, అక్క, తమ్ముడు, నాన్న కలిసి నటించే అవకాశం లేదు. నిజానికి పాండవులు పాండవులు తుమ్మెద సినిమా కూడా నాన్నగారు చేయాలని అనేసరికి తప్పలేదు. ఇక అక్కను టీవీ ఇండస్ట్రీకి లాంఛ్ చేసిందే నేనే.

మా ఇద్దరికీ పడుదు అనే దానిపై క్లారిటీ ఏంటి అంటే.. ఆమెతో డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తుంటా.. అదే ప్రాబ్లమ్ తనకి. మా అక్కకి ఏంటి అంటే.. వీడు పిలిస్తే షోలకు రాడు.. ఫంక్షన్లకు రాడు అని కోపం ఉంటుంది. నా ఫంక్షన్లకు నేను వెళ్లాలి అంటేనే నాకు భయం. జనాన్ని చూస్తే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకే అక్కకు నాకు డిస్టెన్స్. ఇక ట్రోలింగ్స్‌ను నేను పెద్దగా పట్టించుకోను. నాన్న ముందు ఇంగ్లీష్ మాట్లాడితే నచ్చదు. అందుకే నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికి నాన్న ముందు తెలుగు మాట్లాడమని చెబుతాను అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -