నితిన్, షాలినీ ఎంగెజ్మెంట్ అయిపోయింది..!

942
Hero Nithin and Shalini engagement
Hero Nithin and Shalini engagement

నితిన్ తన బ్యాచ్‍లర్ లైప్‍కి గుడ్ బాయ్ చెప్పేసాడు. ఐదు సంవత్సరాలుగా షాలినితో ప్రేమలో ఉన్న నితిన్.. ఫిబ్రవరి 15న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నితిన్, షాలిని ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఈ ఎంగెజ్మెంట్ కి ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు.

ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ పిక్స్ చూసిన వారంతా సూపర్ కపుల్స్ అంటూ కామెంట్స్ పెడుతూ కాబోయే దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఏప్రిల్ 16న శాలిని నితిన్ పెళ్లి దుబాయిలో జరగబోతోంది. ఈ పెళ్లికి కేవలం వంద మంది సన్నిహితులు మాత్రమే హాజర్ కాబోతున్నారట.

ఎనిమిది సంవత్సరాలుగా షాలినితో తనకు పరిచయం ఉందని లాస్ట్ ఐదు సంత్సరాల నుంచి ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో నితిన్ చెప్పుకొచ్చాడు. షాలినీ రీసెంట్ గా బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి ఇండియాకు వచ్చిందట. ఇండియాకి వచ్చాక పేరెంట్స్ కి వాళ్ల ప్రేమ విషయం చెప్పడంతో.. వాళ్లు కూడా ఒప్పుకున్నారట.

Loading...