Friday, March 29, 2024
- Advertisement -

నితిన్ పెళ్లి క్యాన్సల్.. ఏం జరిగింది ?

- Advertisement -

టాలీవుడ్ లో వన్ ఆఫ్ దా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ పెళ్లి పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో పెళ్లికి ముందు ఓ చిన్న ఫంక్షన్ ను ఆయన ఇంట్లో చాలా ఘనంగా నిర్వహించారు. నితిన్ కు కాబోయే భార్య పేరు షాలిని. బిజినేస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన షాలిని సొంత ఊరు నాగర్కర్నూల్.

ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. ఆమె తల్లి ప్రజారాజ్యం పార్టీ తరపున నాగర్కర్నూలో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నితిన్ గత ఐదు సంవత్సరాలుగా షాలినీతో ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గానే వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఏప్రీల్ 16న దుబాయ్ లో వీరి వెడ్డింగ్ కు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ బాగా ఉండటంతో తమ వెడ్డింగ్ డెస్టినేషన్ మార్చుకున్నాడు నితిన్.

ఏప్రిల్ 16 న హైదరాబాద్ లోని వివాహం చేయాలని ఇరు కుటుంబ సభ్యులు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 15న ఎంగెజ్మెంట్, ఏప్రిల్ 16 వెడ్డింగ్ కి ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట. పెళ్లి తర్వాత ఏప్రిల్ 21న హైదరాబాద్లోనే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు చేయబోతున్నారు. ఈ రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -