Friday, March 29, 2024
- Advertisement -

శ్రీరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన నితిన్

- Advertisement -

న‌టి శ్రీరెడ్డి నిన్న ప‌వ‌న్ మీద చేసిన కామెంట్స్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిన్న శ్రీరెడ్డి ప‌వ‌న్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వ మాకు చెబుతున్నావా… నిన్ను నేను అన్నా అని పిలిచి త‌ప్పు చేశానని త‌న చెప్పుతో తానే కొట్టుకుంది శ్రీరెడ్డి. పైగా ప‌వ‌న్‌ని మిడిల్ ఫింగ‌ర్‌తో పొలుస్తు త‌న వేలు చూపించి మ‌రి దారుణంగా అవ‌మాన‌ప‌రిచింది. ప‌వ‌న్ వాళ్ల అమ్మ‌ను కూడా అన‌రాని మాట అనేసింది.దీనిని చాలామంది త‌ప్పుప‌డుతున్నారు.సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇక పవన్ అభిమానుల ఏకంగా RIP అంటు పోస్టులు పెడుతున్నారు.

అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో ఆమెని బండబూతులు తిడుతున్నారు. పవన్ వీరాభిమాని అయిన హీరో నితిన్ ఆమె మాటలకు స్పందించారు.‘‘ప్రతి ఒక్క చర్యకూ.. ప్రతి చర్య ఉంటుంది. దాని కోసం వెయిట్ చెయ్.. రియాక్షన్ వస్తోంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు.వ‌రుణ్ తేజ్ ట్వీట్ట‌ర్లో పోస్ట్ చేసిన దానికి ప్ర‌తి ట్వీట్ చేశాడు నితిన్‌.ఎంతైనా ప‌వ‌న్ వీరాభిమాని క‌దా ఆ మాత్రం వార్నింగ్ ఇవ్వ‌క‌పోతే ఎలా అనుకుంటున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -