కారు ప్రమాదంపై స్పందించిన హీరో రాజ్ తరుణ్..

328
Hero Raj tarun respond on car accident letter released in twitter
Hero Raj tarun respond on car accident letter released in twitter

సోమవారం అర్ధరాత్రినార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డులో కారు ప్రమాదంపై స్పందించారు హీరో రాజ్ తరుణ్. ప్రమాదం జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్‌ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో ట్విట్టర్ లో స్పందించారు. తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు తాను అదృష్టవంతుడినని రాజ్ తరుణ్ తెలిపాడు. కారు ప్రమాదం అనంతరం తాను అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నానని చెప్పాడు.

‘నార్సింగి సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారుపై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్దానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డానని ట్విట్టర్ లో తెలిపారు.త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు.

Loading...