Saturday, April 20, 2024
- Advertisement -

సత్యదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు ?

- Advertisement -

ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఈ లాక్ డౌన్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అదుకున్నాడు. ఈ సినిమాని ‘కేరాఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కగా.. ‘బాహుబలి’ నిర్మాతలైన ‘ఆర్కా మీడియా’ వారు నిర్మించారు.

ప్రస్తుతం సత్యదేవ్.. ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో చేస్తున్నాడు. నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఇది ఇలా ఉండగా.. సత్యదేవ్ రీసెంట్ గా ఒక టీవీ షోలో పాల్గొన్నాడు. అక్కడ ఎవరికి తెలియని విషయాలు చెప్పుకొచ్చాడు. సత్యదేవ్ మాటల్లో.. “ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ఆప్గానిస్థాన్ వెళ్ళాము. ఓ రోజు అక్కడ నాకు ఏమీ తోచక బయటకు కు వెళ్ళి తిరుగుతున్నాను. అది గమనించిన అక్కడి పోలీసులు.. నేనేదో సూసైడ్ బాంబర్ అనుకుని నన్ను అరెస్ట్ చేశారు.

అప్పటికీ నేను హిందూస్థాని అని చెబుతున్నా వాళ్లకు అర్ధం కావడం లేదు. భాష అర్దం కాక నన్ను అరెస్ట్ చేశారని నాకు తెలుస్తోంది. కానీ ఆ టైంలో నేను ఏం చేయలేకపోయాను. ఆ తర్వాత మా సినిమా టీం చెప్పడంతో.. విషయం అర్దం చేసుకుని వదిలిపెట్టారు” అని సత్య చెప్పుకొచ్చాడు. అలానే “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిత్రాన్ని వదిలేసుకున్నట్లు చెప్పాడు.

నాగబాబు నీకు మగతనం ఉందా ?.. జగన్ జోలికొస్తే నీ పని ఫట్ :…

ఒక్క రోజు షూటింగ్ చేస్తే రమ్యకృష్ణకు ఎంత ఇస్తారో తెలుసా ?

మారుతీ భలే కాపీ కొట్టేశావే.. ఎవరికీ డౌట్ రాదనుకున్నావా..?

బిగ్ బాస్‌లో నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ.. ఎందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -