శిరీష్ గురించి చెప్పమంటే ఇబ్బందిపడ్డ సూర్య

693
Hero Surya Embarrassed to Talk about Allu Sirish
Hero Surya Embarrassed to Talk about Allu Sirish

సూర్య హీరోగా నటించిన ‘బందోబస్తు’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆర్య ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ పాత్రను అల్లు శిరీష్ చేయాల్సింది. కానీ అప్పట్లో కాల్షీట్లు లేకపోవడం వల్ల శిరీష తప్పుకున్నాడు. ఆ స్థానంలో ఆర్య ఈ సినిమాలో నటించాడు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో అల్లు శిరీష్ తప్పుకునే అంశంపై మాట్లాడాల్సి వచ్చిన సూర్య తికమక పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అల్లు శిరీష్ గురించి ప్రశ్నించినప్పుడు సూర్య ఎలా స్పందించాలో తెలీక ఇబ్బంది పడ్డాడు.

కొన్ని పేపర్ ఇష్యుస్ వల్ల, ఆఖరి నిమిషంలో లో జరిగిన మార్పుల వల్ల శిరీష్ ఈ సినిమా చేయలేకపోయారని సూర్య అన్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయని అందుకే అల్లు శిరీష్ సినిమా చేయలేదని చెప్పారు సూర్య. ఇదంతా కాకుండా కాల్షీట్ల సమస్య వల్ల సినిమాలో నటించలేదు అని చెప్పి ఉంటే సరిపోయేది కానీ పేపర్ అని, ఆఖరి నిమిషంలో మార్పులని సూర్య చెప్పడం వల్ల ఇప్పుడు చిత్రబృందం కావాలని శిరీష్ ని తప్పించిందని పుకార్లు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో సయేషా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె రికమెండ్ చేయడంతో శిరీష్ స్థానంలో ఆర్య ఎంపిక చేశారని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా మరొక ఐదు రోజుల్లో విడుదల కాబోతుంది.

Loading...