Tuesday, April 23, 2024
- Advertisement -

ఇన్ని గొప్ప‌లు చెప్పిన విశాల్ ఓటు ఎందుకు వేయ‌లేదో..?

- Advertisement -

ఇండియాలో ఓటు అనేది ప్రాథమిక హ‌క్కు. కాని ఇండియాలో ఓటింగ్ శాతం మాత్రం త‌క్కువుగానే ఉంది. ఇండియాలో చ‌దువుకున్న వారే ఓటు వేయ‌డానికి ఎక్కువుగా ఆస‌క్తిక‌న‌బ‌ర‌చ‌డం లేద‌ని ఓ స‌ర్వేలో తెలింది. దీని కోసం ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప‌లువురు సినిమా వాళ్ల చేత ఓటు వేయ‌ల‌ని ప్ర‌చారం చేయిస్తున్నారు.

అయితే నిన్న(గురువారం) త‌మిళ‌నాడులో జ‌రిగిన రెండో విడుత పోలీంగ్‌లో త‌మిళ స్టార్ హీరోలు, హీరోయిన్స్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కాని ఒక్క‌రు త‌ప్ప‌. అత‌ను మ‌రెవ్వ‌రో కాదు త‌మిళ స్టార్ హీరో విశాల్. స‌మాజం , రైతులు గురించి గొప్పలు చెప్పే విశాల్ ఓటు వేయ‌క‌పోవ‌డం ఏంట‌ని చాలామంది అత‌న్ని ప్ర‌శ్నిస్తున్నారు. పైగా త‌మిళ రాజ‌కీయాల్లో పోటీ చేయ‌ల‌ని భావించిన విశాల్ ఓటు వేయ‌క‌పోవ‌డం ఏంట‌ని త‌మిళ ప్ర‌జ‌లు అత‌న్ని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే విశాల్ ఎందుకు ఓటు వేయ‌లేక‌పోయారో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అతని ఫ్యాన్స్‌. విశాల్ తమిళనాడులో ఓటింగ్ జరిగిన రోజున అజర్ బైజాన్‌లో తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడట. అందుకే ఓటు వేయ‌లేక‌పోయాడ‌ని అత‌ని అభిమానులు చెబుతున్నారు. ఓటు కోసం సినిమా షూటింగ్ ఒక్క రోజు వాయిదా వేయ‌లేక‌పోయాడా అని నెటిజ‌న్లు విశాల్‌ను విమ‌ర్శిస్తున్నారు. స్టేజీల మీద గొప్ప‌లు చెప్ప‌డం కాదు ,ఓటు వేసి స‌రైన ప్ర‌భుత్వాన్ని ఎంచుకోవ‌డంతో భాగ‌స్వామి కావాల‌ని విశాల్‌కు హిత‌బోద చేస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -