Friday, April 26, 2024
- Advertisement -

హీరోతో ఎఫైర్ గురించి అడిగితే మండిప‌డ్డ హీరోయిన్ అంజ‌లి

- Advertisement -

తెలుగు హీరోయిన్ అంజ‌లి టాలీవుడ్‌లో క‌న్నా త‌మిళంలోనే ఎక్కువుగా పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో వ‌రుస విజ‌యలు సాధిస్తు అక్క‌డ స్టార్ హీరోయిన్‌గా మారింది.ఫోటో సినిమాతో సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తొలి సినిమా ఫెయిల్ అవ్వ‌డంతో తెలుగులో ఛాన్స్‌లు రాలేదు. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్ అయింది ఈ భామ‌. అక్క‌డ అంజ‌లికి బాగానే అవ‌కాశాలు వ‌చ్చాయి. షాపింగ్ మాల్,జ‌ర్ని వంటి వ‌రుస స‌క్సెస్‌లు చూసింది అంజలి.దీంతో తెలుగులో కూడా బాగానే అవ‌కాశాలు వ‌చ్చాయి.

వెంక‌టేశ్ ,బాల‌కృష్ణ‌,ర‌వితేజ వంటి హీరోల‌తో సినిమాలు చేసింది అంజ‌లి. అయితే కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో ఆ మ‌ధ్య వార్త‌ల్లో నిలిచింది. ఇక ఈ మ‌ధ్య ఓ త‌మిళ హీరోతో కొంతకాలం ఎఫైర్ కూడా సాగించింది అంజ‌లి. తాజాగా ఈ భామ త‌న ప్రేమ‌,బాయ్‌ఫ్రెండ్ గురించి కొన్ని విష‌యాల‌ను మీడియాతో పంచుకుంది. త‌మిళ హీరో జైతో అంజిలి ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన అంజ‌లి ..నేను ఎక్క‌డ కూడా జైతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఎవ్వ‌రితోనే చెప్ప‌లేదు క‌దా అంటు మీడియాను ఎదురు ప్ర‌శ్నించింది.

కాస్తా చ‌నువుగా ఉంటే అది ప్రేమ‌నే అని ప్ర‌శ్నించింది అంజ‌లి. మీడియానే ఏదేదో ఊహించుకొని తమ చుట్టూ ప్రేమ కథ అల్లేసిందని దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించింది. ఇక త‌న పెళ్లి గురించి కూడా స‌మాధానం చెప్పేసింది. ఇప్ప‌ట్లో త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని, త‌న దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని చెప్పుకొచ్చింది. అంజ‌లి ప్ర‌స్తుతం మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టితో క‌లిసి ‘పెరంబు’ అనే సినిమాలో నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -