హీరోయిన్ భూమిక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా..?

1612
Heroine Bhumika faced financial problems
Heroine Bhumika faced financial problems

టాలీవుడ్ హీరోయిన్ భూమిక స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది. చిరంజీవి,వెంక‌టేశ్‌, నాగ‌ర్జున వంటి సీనియ‌ర్ హీరోల‌తో పాటు ,మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల‌తో కూడా హీరోయిన్‌గా నటించింది.ఖుషీ, ఒక్కడు,సింహాద్రి వంటి సూపర్ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే పెళ్లి చేసుకుని కొంతకాలం సినిమాల‌కు విరామం ఇచ్చింది.భరత్ ఠాకూర్ అనే వ్యాపార వేత్త‌ను పెళ్లి చేసుకుంది భుమిక‌. చాలాకాలం త‌రువాత భుమిక తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.

రీఎంట్రీలో భుమిక‌కు అక్క‌, వ‌దిన క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తు ఫుల్ బిజీగా మారింది. అయితే ఆమె మ‌ళ్లీ నటించ‌డానికి కార‌ణం ఆర్థిక ఇబ్బందులే అని స‌మాచారం.త‌న భ‌ర్త భరత్ ఠాకూర్ పెట్టిన వ్యాపారాల‌లో బాగా న‌ష్టాలు రావ‌డంతో వీరు ఆర్ధికంగా ఇబ్బంది ప‌డ్డార‌ని తెలుస్తోంది. దీంతోనే భుమిక మ‌ళ్లీ సినిమాలలో న‌టించ‌డానికి రెడీ అయింద‌ని తెలుస్తోంది. భుమిక రీఎంట్రీ త‌రువాత నాని,నాగ‌చైత‌న్య వంటి హీరోల‌తో క‌లిసి న‌టించింది.