Thursday, April 25, 2024
- Advertisement -

అత‌నితో డేటింగ్ చేస్తున్నా..!

- Advertisement -

అక్కినేని అఖిల్ హీరోగా న‌టించిన రెండో సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచియం అయింది కళ్యాణి ప్రియదర్శిని. ఈ సినిమా పెద్దగా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. అక్క‌డ కళ్యాణి ప్రియదర్శినికి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తాజాగా ఈ భామ సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్ర‌ల‌హ‌రి సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది.

సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియాతో సినిమా విశేషాల‌తో పాటు , వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా పంచుకుంది. ప్ర‌స్తుతం తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని చెప్పుకొచ్చింది కళ్యాణి ప్రియదర్శిని. మరో మూడేళ్లలో అతడిని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పింది. తమ ప్రేమను ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించారని సంతోషంగా ప్రేమ కబుర్లను షేర్ చేసుకుంది. అయితే ప్రేమించిన వ్య‌క్తి ఎవ‌రో చెప్పడం లేదు. త్వ‌ర‌లోనే మీకు చెబుతాన‌ని స‌స్పెన్స్‌ను కొన‌సాగించింది. కల్యాణి ప్రియదర్శని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -